---Advertisement---

హీరోగా రవితేజ మేనల్లుడు మాధవ్ ఎంట్రీ.. ‘మారెమ్మ’ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు

June 18, 2026

---Advertisement---

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కుటుంబం నుంచి మరో యువ నటుడు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. రవితేజ సోదరుడు(Ravi Teja Brother), నటుడు రఘు కుమారుడు (Raghu Son) మాధవ్ (Madhav) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’(Maremma). గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్(Moksha Arts) బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు (Mayur Reddy Bandaru) తొలి నిర్మాణంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ‘మారెమ్మ’ అనే శక్తివంతమైన టైటిల్‌తో పాటు పోస్టర్‌లో కనిపించిన గ్రామీణ నేపథ్యం (Rural Backdrop) ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. దీంతో ఈ సినిమాపై సినీ అభిమానుల్లో మంచి చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సినిమా విడుదలకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ ‘ఈసారి బోనాల జాతర థియేటర్లలో సందడి చేయబోతోంది. బోనాల పండుగ (Bonalu Festival) సందర్భంగా దైవిక భావోద్వేగాలతో కూడిన ‘మారెమ్మ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. జులై 2026లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధంగా ఉండండి’ అంటూ అధికారికంగా ప్రకటించింది.

తాజాగా విడుదలైన పోస్టర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో కథానాయిక తలపై బోనం ఎత్తుకుని కనిపిస్తుండగా, ముందు దేవత విగ్రహం, వెనుక భారీగా తరలివచ్చిన భక్తులు కనిపిస్తూ బోనాల పండుగ వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. రంగురంగుల దృశ్యాలతో పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

గ్రామీణ సంస్కృతి, భక్తి, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ‘మారెమ్మ’తో మాధవ్ హీరోగా ఎలాంటి గుర్తింపు సంపాదిస్తాడో చూడాలనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. జులై 2026లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment