మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana Konidela) దంపతుల గారాలపట్టి క్లింకారా కొణిదెల (Klin Kaara Konidela) నేడు జూన్ 20న తన 3వ పుట్టినరోజును (3rd Birthday) జరుపుకుంటోంది. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని మెగా అభిమానులకు ఈ స్టార్ దంపతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అద్భుతమైన సర్ప్రైజ్ అందించారు. గత 3 సంవత్సరాలుగా అత్యంత గోప్యంగా ఉంచిన తమ కుమార్తె ముఖాన్ని(Daughter Face) తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేస్తూ (Introducing) అభిమానులను(Fans) ఆనందంలో ముంచెత్తారు.
క్లింకారా పుట్టినరోజు సందర్భంగా ఉపాసన కొణిదెల తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అందమైన ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో రామ్ చరణ్, ఉపాసనతో పాటు క్లింకారా ఎంతో ముద్దుగా కనిపించింది. “మా చిన్నారి యువరాణికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఉపాసన ప్రేమతో కూడిన సందేశాన్ని కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటివరకు చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), కుటుంబ సభ్యులతో కలిసి క్లింకారా ఉన్న ఫొటోలు బయటకు వచ్చినప్పటికీ, ప్రతి సందర్భంలోనూ ఆమె ముఖం కనిపించకుండా కుటుంబ సభ్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో క్లింకారా ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పటి నుంచో నెలకొంది. ఇప్పుడు మొదటిసారిగా ఫేస్ రివీల్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
క్లింకారా ఫొటో చూసిన అభిమానులు, నెటిజన్లు “అచ్చం ఉపాసన (Upasana) పోలికలే ఉన్నాయి”, “మెగా ప్రిన్సెస్ (Mega Princess) ఎంతో క్యూట్‌గా (Very Cute) ఉంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పలువురు అభిమానులు ఫొటోను షేర్ చేస్తూ రీ పోస్టులు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా క్లింకారా పేరు ట్రెండింగ్‌లోకి చేరగా, జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.






