---Advertisement---

The Paradise :ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?

July 3, 2026

Summarize with AI

---Advertisement---

నేచురల్ స్టార్ నాని (Nani) కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise). ‘దసరా’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ (Glimpse) సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా, సినిమా స్థాయిపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

మొదట ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే షూటింగ్ పూర్తికాకపోవడం, కొన్ని కీలక పనులు పెండింగ్‌లో ఉండటంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీకి సంబంధించి ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు (Overseas Distributors) చిత్రబృందం ముందస్తు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. తాజా ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 25 (September 25, 2026) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం.

అంతేకాదు, విడుదలకు ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ 24 గురువారం ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను (Premiere Shows) నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు చిత్రబృందం సూచించినట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం మిగిలి ఉన్న షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న గడువులో పూర్తయితేనే ఈ తేదీల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండటంతో మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్న 2026 సెప్టెంబర్ 25 విడుదల తేదీనే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే గ్లింప్స్‌తో అంచనాలను పెంచిన ‘ది ప్యారడైజ్’ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment