---Advertisement---

Harish Rao: హరీష్ రావు సంచలన ప్రకటన..“త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”

July 8, 2026

Summarize with AI

---Advertisement---

సంగారెడ్డి (Sangareddy) ప్రజల ప్రయోజనాల కోసం త్వరలోనే భారీ పాదయాత్ర (Padayatra) చేపట్టనున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రకటించారు. సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును (Sangameshwara-Basaveshwara Lift Irrigation Project) పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న సింగూరు ప్రాజెక్టులోని (Singur Project) నీటిని ప్రభుత్వం పూర్తిగా ఖాళీ చేసిందని ఆరోపించారు.

రైతులకు (Farmers) క్రాప్ హాలిడే (Crop Holiday) ప్రకటించిన ప్రభుత్వం వారికి అందించాల్సిన కనీస పరిహారాన్ని కూడా ఇవ్వలేదని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతో ప్రచారం చేసిన పంటల బీమా పథకం (Crop Insurance Scheme) పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత 2 సంవత్సరాలుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Athmiya Bharosa) లబ్ధిదారులకు నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచారని ఆరోపించారు. పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల ఇందిరమ్మ పేరును కాంగ్రెస్ నాయకులే చెడగొడుతున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్కాముల ప్రభుత్వం నడుస్తోందని, ప్రజలకు మేలు చేసే స్కీముల ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రేపు భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని(BRS Government) ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించిన హరీష్ రావు.. గురుకుల పాఠశాలల టెండర్లలో 3 మంది కాంగ్రెస్ మంత్రులు కలిసి భారీ స్కామ్‌కు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతి (Corruption) అంశంపై అధికారులను నిలదీయడానికి వెళ్లిన తమను పోలీసులు అడ్డుకున్నారని, ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని విమర్శించారు.

తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలపై కూడా హరీష్ రావు స్పందించారు. సహజంగా పొట్టిగా ఉన్న వ్యక్తికి పొడుగ్గా ఉన్న వ్యక్తిని చూస్తే ఈర్ష్య, అసూయ ఉంటుందని, అందుకే రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో తన ఎత్తు గురించే మాట్లాడుతుంటారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజలకు కనిపిస్తున్నాయని హరీష్ రావు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment