---Advertisement---

జన నాయగన్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్..థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే!

July 9, 2026

Summarize with AI

---Advertisement---

దళపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జన నాయగన్ సినిమా విడుదలపై ఎట్టకేలకు స్పష్టత కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సంబంధిత కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.

విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఈ సినిమా విడుదలపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే తాజాగా ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూటర్లు సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్టర్లతో జన నాయగన్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం జూలై 24న జన నాయగన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కెనడాలో చిత్రాన్ని విడుదల చేస్తున్న యార్క్ సినిమాస్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ అదే తేదీని ప్రకటించింది. దాదాపు 6 నెలల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించే ముందు ఇదే తన చివరి సినిమా అని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో జన నాయగన్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే, మమితా బైజు కథానాయికలుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment