---Advertisement---

Lenin Review: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓవర్శీస్ రివ్యూ..సినిమా ఎలా ఉంది?

July 10, 2026

Summarize with AI

---Advertisement---

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin) సినిమా ఈ రోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు కాకపోయినా మంచి ఆసక్తి మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఓవర్సీస్ (Overseas) ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా ప్రారంభం నుంచే బలమైన కథా నేపథ్యం, ఆసక్తికరమైన పాత్రల పరిచయంతో దర్శకుడు స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇచ్చాడు. దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అందించిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ప్రేక్షకులను మొదటి నిమిషం నుంచే కథలోకి తీసుకెళ్లేలా చేసింది.

అయితే మొదటి భాగం ముందుకు సాగేకొద్దీ కథనం కొంత నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా లవ్ ట్రాక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. కమర్షియల్ టెంప్లేట్‌లో సాగే కొన్ని సన్నివేశాలు కూడా కొత్తదనం లేకుండా కనిపించాయి. మంచి ఎమోషనల్ డ్రామాకు అవకాశం ఉన్నప్పటికీ కొన్ని కీలక సన్నివేశాల్లో భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా మళ్లీ గేర్ మార్చుకుంటుంది. థమన్ (Thaman) అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, దర్శకుడు డిజైన్ చేసిన ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లలో మంచి హై తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని అమాంతం పెంచుతూ తర్వాత కథ ఎలా మలుపు తిరుగుతుందనే ఉత్కంఠను పెంచుతుంది.

సెకండ్ హాఫ్ (Second Half) ప్రారంభం నుంచే కథ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఊహించని మలుపులు, విలన్ క్రూరత్వాన్ని చూపించిన తీరు కథకు మంచి బలం చేకూర్చాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన సన్నివేశంలో అఖిల్ (Akhil) నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎలాంటి నేపథ్య సంగీతం లేకుండా, సినిమాటిక్ హంగులు లేకుండా కేవలం తన నటనతోనే ఆ సన్నివేశాన్ని అఖిల్ నిలబెట్టాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓవరాల్‌గా చూస్తే ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్లాక్స్ ఈ సినిమాకు అతిపెద్ద బలాలుగా నిలిచాయి. అఖిల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచాడని ఓవర్సీస్ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, లవ్ స్టోరీలో ఎమోషన్ తగ్గిపోవడం, కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే తడబడటం, రొటీన్ కమర్షియల్ టెంప్లేట్‌లో కథ సాగడం వల్ల లెనిన్ ఒక మంచి ప్రయత్నంగా నిలిచినా పూర్తిస్థాయి ప్రభావాన్ని చూపలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment