---Advertisement---

వరుణ్ తేజ్ “కొరియన్ కనకరాజు”రిలీజ్ డేట్ ఫిక్స్..కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ అంటూ పోస్టర్ రిలీజ్…!

July 10, 2026

Summarize with AI

---Advertisement---

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు'(Korean Kanakaraju) సినిమా నుంచి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను (Release Date) మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానుల్లో సినిమా హైప్ మరింత పెరిగింది.

మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇండో-కొరియన్ (Indo-Korean) హారర్ కామెడీ (Horror Comedy బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్ కొత్త తరహా పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు, లుక్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ప్రతి ప్రమోషనల్ అప్డేట్‌కు మంచి స్పందన రావడంతో మేకర్స్ కూడా అదే జోష్‌ను కొనసాగిస్తున్నారు.

తాజాగా “కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ”(Kanakaraju Is Coming) అంటూ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఈ ఏడాదిలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ అనుభూతికి సిద్ధంగా ఉండండి” అంటూ మేకర్స్ ప్రకటించారు.

కొరియన్ కనకరాజు చిత్రం 7 ఆగస్టు 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగగా, మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment