ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీలకు చెందిన కొందరు నాయకుల ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే నెల్లూరు జిల్లా (Nellore District) చిల్లకూరు మండలానికి చెందిన కొందరు టీడీపీ (TDP) నాయకుల అశ్లీల డ్యాన్సుల (Obscene Dances) వీడియోలు (Videos) సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు మచిలీపట్నంలో జరిగిన మరో సంఘటన చర్చకు దారితీసింది.
తాజాగా మచిలీపట్నం (Machilipatnam) రాణిగారి సెంటర్‌లోని ఓ జ్యువెలరీ దుకాణం పై (Jewellery Shop) అంతస్తులో అశ్లీల డ్యాన్సుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) కార్యాలయ సిబ్బందిగా చెప్పబడుతున్న సైదారావు(Saida Rao), హితేష్(Hitesh), ఆంజనేయులు (Anjaneyulu) యువతులతో కలిసి అశ్లీల డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా, డ్యాన్స్ చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ వీడియోలు చిత్రీకరించినట్లు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గుడివాడ నుంచి యువతులను రప్పించి ఈ కార్యక్రమం నిర్వహించారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. మంత్రి అనుచరుల బరితెగింపుతో మచిలీపట్నంలో సామాన్య ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో అధికార పార్టీ నేతల ప్రవర్తనపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఇలాంటి వివాదాల్లో కనిపించడం రాష్ట్రంలో మహిళల భద్రతపై (Women’s Safety) మరోసారి చర్చకు దారితీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






