---Advertisement---

రైతుల ప్రాణాలను బలితీసుకుంటున్న రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్?

July 13, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) ప్రాంతంలో మరో రైతు (Farmer) మృతి తీవ్ర చర్చకు దారితీసింది. ఉండవల్లి (Undavalli) గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మారెడ్డి (Guntaka Padma Reddy) మృతి చెందడంతో రైతు సంఘాలు, రాజకీయ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని నిర్మాణం (Capital Construction) పేరుతో రైతులపై ఒత్తిడి పెంచుతున్నారని, వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల మంత్రుల సమక్షంలోనే తన భూమికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతు రామారావు (Rama Rao) గుండెపోటుతో మృతి చెందిన ఘటన మరువకముందే, ఇప్పుడు ఉండవల్లి రైతు గుంటక పద్మారెడ్డి మృతి చెందడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. “రైతుల(Farmers) సమాధులపై రాజధాని నిర్మాణమా?” అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ(YSRCP) నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పద్మారెడ్డి(Guntaka Padma Reddy) మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పద్మారెడ్డికి చెందిన ఎకరం 40 సెంట్ల భూమికి కూడా ల్యాండ్ పూలింగ్ (Land Pooling) నోటీసులు జారీ చేశారని ఆయన తెలిపారు.

ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి తీసుకుని ఇతరులకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని వేమారెడ్డి ఆరోపించారు. భూమి రైతు కుటుంబానికి తరతరాల జీవనాధారమని, దానిని వదులుకోవడం ఏ రైతుకైనా అత్యంత బాధాకరమని అన్నారు. ఇది ఒక్క రైతు సమస్య కాదని, భూములు ఇవ్వని రైతులందరి ఆవేదన అని పేర్కొన్నారు.

ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే ఎంత బాధ ఉంటుందో, రైతు భూమి కోల్పోతే కూడా అంతే బాధ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారు రాజధాని అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ తమకు న్యాయం కావాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు.

తీసుకునే భూమికి బదులుగా సమీపంలో సమానమైన భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రైతులపై విమర్శలు చేయడం మానేసి వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment