---Advertisement---

ఫలించిన జగన్ కల.. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు మంజూరు!

July 13, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు నాణ్యమైన ఉచిత వైద్యం(Free Healthcare), వైద్య విద్యను (Medical Education) అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం (Government) రాష్ట్రవ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Government Medical Colleges) ఏర్పాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పదవి వీడే సమయానికి 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తికాగా, వాటిలో 5 కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 2026–27 విద్యా సంవత్సరానికి 100 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇవ్వడం విశేషంగా మారింది. దీంతో పల్నాడు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ విద్య మరింత చేరువ కానుంది. జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2019లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే పల్నాడులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటు కోసం తొలి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించడంతో పాటు 50 ఎకరాల భూమిని సేకరించింది. అనంతరం కరోనా మహమ్మారి కారణంగా పనులు ఆలస్యమైనప్పటికీ, కోవిడ్ అనంతరం పిడుగురాళ్లలో జాతీయ రహదారి పక్కన నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టారు. ఆధునిక భవనాలతో పాటు ఆస్పత్రికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలను కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి కూడా కేంద్రం అనుమతి లభించగా, దాని భవన నిర్మాణం కూడా పూర్తయింది.

2024 జూన్‌లో ప్రభుత్వం మారే సమయానికి పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ నిర్మాణంపై సుమారు రూ.217 కోట్లు వ్యయం చేయబడగా, నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయం తీసుకుంది. దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టింది. టెండర్లకు స్పందన లేకపోవడంతో ప్రైవేటీకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లను రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగిస్తామని జగన్ చేసిన హెచ్చరిక కూడా ఈ ప్రక్రియపై ప్రభావం చూపిందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి లభించడంతో 2026–27 విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ పరిణామం పల్నాడు ప్రాంత యువతకు వైద్య విద్యలో కొత్త అవకాశాలను తెరుస్తుందని, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment