---Advertisement---

Polimera 3: పొలిమేర 3 నుంచి మాస్ అప్‌డేట్.. పవర్‌ఫుల్ రోల్‌లో అర్జున్ ఎంట్రీ!

July 27, 2026

Summarize with AI

---Advertisement---

ఓటీటీలో చిన్న సినిమాగా విడుదలై ఎలాంటి అంచనాలు లేకుండానే భారీ సంచలనం సృష్టించిన ‘పొలిమేర’ ఫ్రాంచైజీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. సత్యం రాజేష్(Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ప్రధాన పాత్రల్లో వచ్చిన తొలి భాగం కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆ తర్వాత వచ్చిన ‘పొలిమేర-2’ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కుతున్న ‘పొలిమేర-3’పై (Polimera-3) భారీ అంచనాలు నెలకొన్నాయి.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు తెరదిస్తూ, ‘పొలిమేర-3’లో యాక్షన్ స్టార్ అర్జున్ సర్జా (Arjun Sarja) కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో అర్జున్ సర్జా (Arjun Sarja) పవర్‌ఫుల్ ఎంట్రీతో పాటు విలన్లపై విరుచుకుపడే యాక్షన్ సీన్లు, నోట్లో సిగరెట్‌తో కనిపించిన వైల్డ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. “యాక్షన్ మీట్స్ పవర్” (Action Meets Power) అనే కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ వీడియో సినిమాపై ఒక్కసారిగా హైప్‌ను మరింత పెంచేసింది.

చేతబడి, క్షుద్ర పూజలు, పల్లెటూరి నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కథ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతుందని ఇప్పటికే స్పష్టమవుతోంది. తొలి 2 భాగాలను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించిన అనిల్ విశ్వనాథ్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, ఈసారి కథను మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

సోనిలి నారంగ్ ప్రజెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘పొలిమేర-2’ క్లైమాక్స్‌లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు ‘పొలిమేర-3’లో సమాధానాలు దొరకనున్నాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అర్జున్ సర్జా ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment