అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘లెనిన్’(Lenin) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ రూరల్ యాక్షన్ డ్రామా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు (Rs.100 Crore Gross Collections) సాధించిన ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్గా నటించగా, దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు (Murali Kishor Abburu) పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్లపై అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), నాగవంశీ (Naga Vamsi) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది. ముఖ్యంగా అఖిల్ మాస్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా అభిమానులను ఫుల్‌గా ఆకట్టుకున్నాయి.
థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో(OTT) కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 (ZEE5) సొంతం చేసుకోగా, ఆగస్టు 7 నుంచి తెలుగు భాషలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ స్పెషల్ ప్రోమో వీడియోతో అధికారికంగా ప్రకటించారు.
ప్రోమోలో “గర్జన మొదలవుతోంది… ప్రేమ, ప్రతీకారం, విప్లవాల కథ మీ ముందుకు వస్తోంది. ఆగస్టు 7 నుంచి జీ5లో ‘లెనిన్’ స్ట్రీమింగ్” (Lenin Streaming) అంటూ ప్రకటించారు. థియేటర్లలో ఈ బ్లాక్‌బస్టర్‌ను మిస్ అయిన ప్రేక్షకులు, మరోసారి చూడాలనుకునే అభిమానులు ఆగస్టు 7 నుంచి జీ5లో ఎంజాయ్ చేయొచ్చు.






