---Advertisement---

Alias Rukmini: నాని నిర్మాతగా, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రుక్మిణి’ గ్లింప్స్ రిలీజ్..!

August 3, 2026

Summarize with AI

---Advertisement---

నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా, యూత్ స్టార్ నితిన్ (Nithiin) హీరోగా టాలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కోర్ట్’ సినిమాతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న నాని, తన వాల్‌పోస్టర్ సినిమాస్ (Wall Poster Cinemas) బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ‘దండోరా’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు మురళి కాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

చిత్రబృందం ఈ సినిమాకు ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ స్పెషల్ గ్లింప్స్ (Glimpse) వీడియోను విడుదల చేసింది. టైటిల్‌తో పాటు విడుదలైన ఈ వీడియో చూస్తుంటే సినిమా క్లాసిక్ లవ్ స్టోరీతో (Classic Love Story) పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తోంది.

గత కొంతకాలంగా మాస్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన నితిన్, ఈసారి తనకు బాగా కలిసి వచ్చిన రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా నితిన్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించడమే కాకుండా, ఆయనకు గ్రాండ్ కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

విభిన్నమైన కథలను మాత్రమే ఎంపిక చేసుకునే నిర్మాతగా నానికి ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. అదే నమ్మకంతో ‘అలియాస్ రుక్మిణి’ కథను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. నిర్మాతగా ఇప్పటివరకు 100 శాతం విజయాలను అందుకున్న నాని జడ్జ్‌మెంట్‌పై సినీ అభిమానులకు మంచి నమ్మకం ఉండటంతో, నితిన్ – నాని – మురళి కాంత్ కాంబినేషన్‌పై ఇప్పటినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment