రాజమహేంద్రవరంలో(Rajamahendravaram) ఉన్మాదులు చర్యతో కారు ప్రమాదంలో(Car Accident) తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (Dr. Priyanka) (28) హైదరాబాద్‌లోని(Hyderabad) కిమ్స్ ఆసుపత్రిలో(KIMS Hospital) చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. సినిమా చూసి స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఆమెను మద్యం మత్తులో(Drunk) ఉన్న యువకులు(Youth) కారుతో వెనుక నుంచి పదే పదే ఢీకొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటన అనంతరం కేసు దర్యాప్తు తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రమాదాన్ని సాధారణ యాక్సిడెంట్‌గా చిత్రీకరించి నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు కూడా మీడియాలో వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ(AP Government) స్పందనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వైద్య విద్యార్థిని పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించకపోవడం బాధాకరమని ఆమె తండ్రి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్రతినెలా హైదరాబాద్‌కు వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా? కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డను పరామర్శించాలనే ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దలకు రాలేదా? ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందించండి అని కూడా చెప్పలేకపోయారా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర హోంమంత్రి, జిల్లా అధికారులు సైతం ఇంతటి తీవ్ర ఘటనపై ఇప్పటివరకు స్పందించలేదని వెంకటేష్(Venkatesh) ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రియాంకకు మెరుగైన వైద్యం, ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు.





