---Advertisement---

7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..!

August 14, 2026

Summarize with AI

---Advertisement---

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ప్రభాస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతా డీపీని (DP) మార్చడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే డీపీని కొనసాగించారు. తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి (Baahubali) సినిమాలోని ఫొటోను దాదాపు 7 ఏళ్లుగా డీపీగా ఉంచారు.

తన సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, అప్‌డేట్లు ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నప్పటికీ డీపీని మాత్రం మార్చలేదు. అయితే తాజాగా చాలా కాలం తర్వాత తన డీపీని మార్చి ఫౌజీ (Fauji) లుక్‌లో ఉన్న ఫొటోను పెట్టారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

డీపీ మార్చిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది మంది అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు. దీంతో #PrabhasDP హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియా వేదికలపై ట్రెండ్ అవుతోంది.

ప్రభాస్ కేవలం తన డీపీని మార్చడంతోనే సోషల్ మీడియాలో (Social Media)భారీ హంగామా సృష్టించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఫౌజీ సినిమాపై కూడా ఈ కొత్త డీపీ ఆసక్తిని మరింత పెంచింది.

హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment