టీమిండియా (Team India) మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు (Ravichandran Ashwin) ఇటీవల ఓ ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్‌తో(International Cricket) పాటు ఐపీఎల్‌కు(IPL) కూడా రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా (YouTube Content Creator) బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ రోజు యూట్యూబ్ వీడియో రికార్డ్ చేస్తుండగా ఇంటికి పోలీసులు రావడంతో అశ్విన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
అశ్విన్ వీడియో రికార్డింగ్‌లో ఉండగా ఇంటి సెక్యూరిటీ గార్డు (Security Guard) వరుసగా 3, 4 సార్లు ఫోన్ చేశాడు. సాధారణంగా అతడు ఇలా పదేపదే ఫోన్ చేయడని, దీంతో ఏదో ముఖ్యమైన విషయం జరిగి ఉంటుందని అనుకున్నానని అశ్విన్ చెప్పాడు. అదే సమయంలో తన భార్య(Wife) కూడా ఫోన్ చేయడంతో వెంటనే ఆమెకు తిరిగి కాల్ చేశాడు.
ఇంటి తలుపు వద్ద ఓ పోలీసు(Police) ఉన్నారని భార్య చెప్పడంతో అశ్విన్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే వెళ్లి చూడగా అసలు విషయం తెలిసింది. వీసా (Visa) కోసం తాను సమర్పించిన పాస్‌పోర్ట్‌ను (Passport) తిరిగి ఇచ్చేందుకు ఓ పోలీసు అధికారి తన ఇంటికి వచ్చినట్లు అశ్విన్ వెల్లడించాడు. దీంతో ఎలాంటి సమస్య లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నానని చెప్పాడు.
ప్రముఖ క్రికెటర్‌గా ఉన్నప్పటికీ ఇలాంటి సాధారణ ఘటనలు తన జీవితంలోనూ జరుగుతాయని అశ్విన్ సరదాగా చెప్పాడు. తాను ఎప్పుడూ సాధారణ వ్యక్తిలా జీవించాలనుకుంటానని, అందుకే సాధారణ జీవితాన్నే ఇష్టపడతానని పేర్కొన్నాడు.
అశ్విన్ 2024 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం 2025లో ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో 287 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 765 వికెట్లు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉండగా.. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) అగ్రస్థానంలో ఉన్నాడు.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అశ్విన్ తన అనుభవాలను క్రికెట్ విశ్లేషణ, యూట్యూబ్ కార్యక్రమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ కొనసాగుతున్నాడు.








