ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల(Independence Day Celebrations) సందర్భంగా కూటమి నేతల తీరుపై వివాదాలు చెలరేగాయి. హిందూపురంలో(Hindupur MLA) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సతీమణి(Wife) వసుంధర జాతీయ పతాకాన్ని(National Flag) ఆవిష్కరించడంతో పాటు, ఆమెకు అధికారిక ప్రొటోకాల్(Official Protocol) మర్యాదలు కల్పించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బాలకృష్ణ అనారోగ్యం, శస్త్రచికిత్స కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోవడంతో తన తరఫున తాను పాల్గొన్నట్లు వసుంధర వెల్లడించారు. అయితే ఎలాంటి అధికారిక పదవి లేని వ్యక్తికి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ కల్పించడంపై ప్రశ్నలు తలెత్తాయి.
ఇదే సమయంలో ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) కార్యాలయంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని తలకిందులుగా కట్టడం చర్చనీయాంశమైంది. జెండా ఎగురవేసే సమయంలో పొరపాటు గుర్తించిన వెంటనే దాన్ని కిందకు దించారు.
మరోవైపు శ్రీకాకుళంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో (Har Ghar Tiranga Rally) టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ (Gondu Shankar) జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) నడుపుతున్న బైక్‌పై వెనుక కూర్చున్న ఎమ్మెల్యే గొండు శంకర్ చేతిలో జాతీయ పతాకం తలకిందులుగా కనిపించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాల్లో ప్రొటోకాల్, జాతీయ పతాక నియమాలు పాటించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలు కూటమి నేతల వ్యవహారశైలిపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.





