కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని (Union Education Minister Pralhad Joshi) కలిసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు (In-Service Teachers) టెట్ (TET) నుంచి మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేసిన ముగ్గురు ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడం వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్సీపీ(YSRCP) ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి(Lella Appireddy), కల్పలతారెడ్డి (Kalpalatha Reddy) ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యాశాఖలోనూ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’(Red Book Constitution) అమలు చేస్తున్నారని విమర్శించారు.
టెట్ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసిన వ్యవహారాన్ని డీఎస్సీ అక్రమాలతో ముడిపెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. సీకే వెంకటనాథరెడ్డి(CK Venkatanatha Reddy), ఎస్. అమరనాథ్(S. Amarnath), ఎన్. సంగమేశ్వర్లపై(N. Sangameshwar) విధించిన సస్పెన్షన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ కేంద్ర మంత్రిని కలిసిన ఉపాధ్యాయులపై కక్షపూరితంగా చర్యలు తీసుకోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.





