---Advertisement---

పెంపుడు కుక్క బఘీరాకు జూనియర్ ఎన్టీఆర్ కన్నీటి వీడ్కోలు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

August 19, 2026

Summarize with AI

---Advertisement---

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తెరపై మాస్ హీరోగా కనిపించినా.. వ్యక్తిగత జీవితంలో ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తి. గత నాలుగేళ్లుగా తన జీవితంలో భాగమైన పెంపుడు కుక్క (Pet Dog) బఘీరా (Bagheera) మరణించడంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్నేహితుడిగా (Friend) తన జీవితంలోకి వచ్చిన బఘీరా.. ఆ తర్వాత కుటుంబంలో ఒకరిగా మారిపోయిందని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో హృదయపూర్వక వీడ్కోలు పలికారు.

బఘీరాతో కలిసి గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ పలు ఫొటోలను పంచుకున్నారు. తన జీవితంలోని ప్రతి రోజును బఘీరా ప్రేమ, నమ్మకంతో నింపిందని తెలిపారు. నాలుగేళ్ల పాటు తనతో కలిసి ప్రయాణించినందుకు కృతజ్ఞతలు చెబుతూ.. ఇక స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారి.. నిన్ను చాలా ప్రేమించాను.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ భావోద్వేగ సందేశం ఇచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు పెంపుడు జంతువులపై ఉన్న ప్రేమ గురించి గతంలోనూ పలుమార్లు వెల్లడైంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో రామ్ చరణ్ (Ram Charan) కూడా తారక్‌కు పెంపుడు జంతువులతో (Pets) ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే వ్యక్తి తారక్ అని చరణ్ తెలిపారు.

బఘీరా మరణంతో తారక్ మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన భావోద్వేగ పోస్ట్ (Emotional Post) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. బఘీరాకు నివాళులు అర్పిస్తూ.. తారక్‌కు ధైర్యం చెబుతున్నారు. మనుషులకు, పెంపుడు జంతువులకు మధ్య ఉండే అనుబంధం ఎంత గాఢంగా ఉంటుందో తారక్ వీడ్కోలు మరోసారి గుర్తుచేసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment