---Advertisement---

మెగాస్టార్ చిరంజీవి #MEGA158 సినిమా టైటిల్ & గ్లింప్స్ వీడియో రిలీజ్.!

August 22, 2026

Summarize with AI

---Advertisement---

సంక్రాంతి(Sankranti) బరిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాస్ జాతరకు రంగం సిద్ధమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవికి అదిరిపోయే విజయాన్ని అందించిన దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) మరోసారి మెగాస్టార్‌తో జతకట్టారు. #Mega158గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కాకా’(Kaaka) అనే టైటిల్‌ను(Title) ఖరారు చేస్తూ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్(Glimpse) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గ్లింప్స్‌ను చూస్తే సినిమాలో చిరంజీవి రెండు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘కె. సత్యం’(K. Satyam) అనే సూపర్‌వైజర్ పాత్రలో మెగాస్టార్ ఎంట్రీ సింపుల్‌గా మొదలవుతుంది. చెన్నై టీమ్‌తో ఫోన్‌లో మాట్లాడటం, లోడ్ సకాలంలో చేరుతుందని హామీ ఇవ్వడం, పండుగ టార్గెట్ కారణంగా సునీల్ అడిగిన సెలవును తిరస్కరించడం వంటి సన్నివేశాలతో చిరంజీవి పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేశారు.

గెటప్ శ్రీను స్కూటర్ కీస్‌ను నీటిలో పడేయడం, ఓ కుక్క రిమోట్‌ను తీసుకురావడం, రిమోట్‌లోని మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీసే సమయంలో తుపాకులు బయటపడటం గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. అద్దాలతో కనిపించే మధ్యవయస్కుడైన ‘కె. సత్యం’ పాత్రలో చిరంజీవి హుందాగా కనిపిస్తే, వెంటనే ‘కాకా’ టైటిల్‌ను రివీల్ చేయడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

ఇక ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే యంగ్ అండ్ స్టైలిష్ చిరంజీవి లుక్ మాత్రం అదిరిపోయింది. చేతిలో గన్స్‌తో మాస్ పోజ్‌లో మెగాస్టార్ కనిపించిన తీరు అభిమానులకు వింటేజ్ చిరంజీవిని గుర్తుచేస్తోంది. మాస్, క్లాస్ కలయికలో చిరంజీవిని బాబీ మరోసారి తనదైన శైలిలో ప్రజెంట్ చేసినట్లు గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.

విజయ్ కార్తీక్ కన్నన్ (Vijay Karthik Kannan) సినిమాటోగ్రఫీ గ్లింప్స్‌కు గ్రాండ్ లుక్‌ను అందించింది. ఎస్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా ‘గ్యాంగ్ లీడర్’లోని ‘గ్యాంగ్ గ్యాంగ్’ ఐకానిక్ బీట్‌ను రీమిక్స్ చేసి ఉపయోగించడం మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి, భాను-నందు రచనా సహకారం అందిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) పతాకంపై వెంకట్ కె. నారాయణ(Venkat K. Narayana) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment