సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటిస్తున్న ‘జైలర్ 2’పై(Jailer 2) అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2023లో ఘన విజయం సాధించిన ‘జైలర్’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 అక్టోబర్ 15న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్రబృందం తొలి పాట ‘అలా బొలేలో’ను వి(Ala Bolelo)డుదల చేసింది. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతంతో రూపొందిన ఈ పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
‘అలా బొలేలో’ పాటకు అనిరుధ్ సంగీతం అందించడంతో పాటు గాత్రం కూడా అందించారు. ‘జైలర్’లో ‘కావాలా’ పాటకు సాహిత్యం అందించిన అరుణ్రాజా కామరాజ్(Arunraja Kamaraj) ఈ పాటకు కూడా సాహిత్యం అందించారు. దాదాపు 4 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో రజనీకాంత్‌తో పాటు షమ్నా కాసిమ్ అలియాస్ పూర్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పాట విడుదలైన వెంటనే పూర్ణ నృత్య ప్రదర్శనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ఉత్సాహభరితమైన డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పూర్ణ ఆకట్టుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘కావాలా’ తరహాలో ‘అలా బొలేలో’ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది.
ఇక ‘జైలర్ 2’లో ముత్తువేల్ పాండియన్ (Muthuvel Pandian) పాత్రలో రజనీకాంత్ మరోసారి భారీ యాక్షన్‌తో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన 55 సెకన్ల ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఈసారి కథ మరింత పెద్ద నెట్వర్క్ చుట్టూ సాగనుందని ప్రచార చిత్రం ద్వారా సంకేతాలు ఇచ్చారు. దీంతో ముత్తువేల్ ఎదుర్కొనే సవాళ్లు కూడా మరింత భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
రమ్యకృష్ణ, మీర్నా, యోగిబాబు తమ పాత్రలను కొనసాగించనుండగా, ఎస్.జే. సూర్య(S. J. Suryah) కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే వారి పాత్రల వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది.
ప్రస్తుతం ‘అలా బొలేలో’ పాట సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. అనిరుధ్ సంగీతం, పూర్ణ(Poorna) డ్యాన్స్‌తో ‘జైలర్ 2’ ప్రమోషన్లకు మంచి ఆరంభం లభించింది. దసరా విడుదలకు ముందు రాబోయే తదుపరి అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






