---Advertisement---

రవితేజ ‘ఇరుముడి’ జోరు.. ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. ఓటీటీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

August 22, 2026

Summarize with AI

---Advertisement---

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన ‘ఇరుముడి’(Irumudi) ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాలు, ప్రతీకారంతో కూడిన యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు తొలిరోజే మంచి స్పందన లభించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. భారత్‌లో(India) మొదటి రోజు రూ.14.80 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించింది. మద్యానికి బానిసైన ఓ తండ్రి.. తన కూతురి కోరిక మేరకు అయ్యప్ప దీక్ష(Ayyappa Deeksha) చేపట్టిన తర్వాత అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పులు, ఎదురైన సవాళ్ల చుట్టూ కథ సాగుతుంది. రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తొలి రోజు మంచి వసూళ్లు రావడంతో వారాంతంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే ‘ఇరుముడి’ రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ డీల్‌పై(OTT Deal) కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘ఇరుముడి’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్(Netflix) సుమారు రూ.14 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. డీల్ నిజమైతే థియేట్రికల్ రన్ అనంతరం సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఓటీటీ స్ట్రీమింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు రవితేజ అభిమానులు సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ‘ఇరుముడి’ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment