రాకింగ్ స్టార్ యశ్(Yash) నటించిన పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ (Toxic) ప్రీ రిలీజ్ వేడుకలో (Pre-Release Event) ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Malla Reddy University) ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఉండటంతో పలువురు గాయపడ్డారు.
యశ్‌ను చూసేందుకు అభిమానులు(Fans), విద్యార్థులు (Students) భారీగా తరలిరావడంతో కార్యక్రమం వద్ద సందడి నెలకొంది. ఈ సమయంలో వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సౌండ్ బాక్స్ ఫ్రేమ్‌లు(Sound Box Frames), ఫ్లడ్ లైట్ స్తంభాలపైకి (Flood Light Poles) కొంతమంది విద్యార్థులు ఎక్కారు.
అయితే విద్యార్థుల బరువును తట్టుకోలేక సౌండ్ బాక్స్ ఫ్రేమ్‌లు, ఫ్లడ్ లైట్ స్తంభాలు ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడి తొక్కిసలాట పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, పోలీసులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
స్టార్ హీరో పాల్గొనే కార్యక్రమానికి భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ నిర్వాహకులు తగిన భద్రతా చర్యలు చేపట్టలేదని పోలీసులు గుర్తించారు. అనుమతించిన పరిమితికి మించి జనసమీకరణ, భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు ఏర్పాటు చేయడం ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనపై మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యంతో పాటు ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఘటనకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు టాక్సిక్ చిత్ర బృందంపై (Toxic Movie Team) కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.







