నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన కంటెంట్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా వచ్చిన రెండో సింగిల్ ‘యెష నాగుల కట్ట మీద’తో హైప్ మరింత పెరిగింది.
డల్లాస్‌లో అనిరుధ్ స్పెషల్ సర్‌ప్రైజ్
‘ది ప్యారడైజ్’ రెండో సింగిల్‌ను మేకర్స్ వినూత్నంగా విడుదల చేశారు. ఆగస్టు 28న అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌లో ‘యెష నాగుల’ పాటను వేలాది మంది అభిమానుల సమక్షంలో లైవ్‌గా పాడి పరిచయం చేశారు. అనిరుధ్ పెర్ఫార్మెన్స్‌కు తోడు నాని మాస్ స్టెప్పులతో అదరగొట్టడంతో ఈ కార్యక్రమం మరింత జోష్‌తో సాగింది.
తెలంగాణ జానపదానికి మాస్ టచ్
‘యెష నాగుల కట్ట మీద’ తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించే ప్రముఖ జానపద గీతం. ‘ది ప్యారడైజ్’ కోసం ఈ పాటను మాస్ టచ్‌తో కొత్తగా రూపొందించారు. అనిరుధ్ రవిచందర్ మాస్ బీట్స్, కాసర్ల శ్యామ్ సాహిత్యం, జంగి రెడ్డి, సింగర్ ప్రభ గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డల్లాస్ కాన్సర్ట్‌లో పాటకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.
Dishti anthaaa povaleeeeee 🔥🔥🔥
— THE PARADISE (@TheParadiseOffl) August 29, 2026
Naatu masssss #Yeshanagula madness takes over all overrrr pic.twitter.com/HuIVNNF1yR
ప్రత్యేక ఈవెంట్ లేకుండానే విడుదల
రెండో సింగిల్ కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించకుండా అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లోనే పాటను పరిచయం చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రత్యేక ఈవెంట్ ఖర్చు తగ్గించేలా మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతుండగా.. అనిరుధ్ కాన్సర్ట్‌కు కూడా ఈ పాట మరింత ప్రచారం తీసుకొచ్చిందని మరికొందరు అంటున్నారు.
ఆగస్టు 28న డల్లాస్‌లో లైవ్‌గా పరిచయం చేసిన ‘యెష నాగుల కట్ట మీద’ పాటను ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వేదికలపై విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘ఆయా షేర్’ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.






