---Advertisement---

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ రిలీజ్.. లుక్ అదుర్స్!

August 29, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటిస్తున్న ‘కింగ్ 100’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ.. మేకర్స్ ఇప్పటివరకు పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వలేదు. అయితే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తాజాగా ‘కింగ్ 100’ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

గ్లింప్స్‌ను నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఆసక్తికరంగా ప్రారంభించారు. ‘‘మనుషుల్లో రెండు రకాలు. ఒకరు డబ్బున్నోళ్లు, ఇంకొకరు లేనివాళ్లు. డబ్బు లేనప్పుడు నన్ను అందరూ లూజర్‌లా చూశారు. డబ్బు ఉన్నప్పుడు దే కాల్ మీ ది కింగ్. ఈ గుర్తింపు డబ్బు కంటే శక్తివంతమైనది’’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.

గ్లింప్స్‌లో నాగార్జున లుక్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా చివర్లో నాగార్జున ఓ చిన్నారిని ఎత్తుకుని కనిపించడం ఆసక్తిని పెంచింది. ఆ చిన్నారి ఎవరు? సినిమాలో ఆమె పాత్ర ఏంటి? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.

గ్లింప్స్‌ను బట్టి చూస్తే.. పేదరికం నుంచి సంపన్నుడిగా నాగార్జున ఎదిగిన ప్రయాణం చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఎలా సంపాదించుకున్నారనే అంశాలను సినిమాలో చూపించనున్నట్లు అర్థమవుతోంది.

‘కింగ్ 100’ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. నాగార్జున సరికొత్త లుక్, ఆసక్తికరమైన కథతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment