---Advertisement---

HATAH: పిల్లి చుట్టూ మిస్టరీ.. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ వైరల్!

August 31, 2026

Summarize with AI

---Advertisement---

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటుడిగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ(Producer) విభిన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 మంది కొత్త నటీనటులతో తెరకెక్కిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో నిర్మాతగా పరిచయమైన ఆయన, ఇప్పుడు ‘హతః’తో (HATAH) మరో కొత్త ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ (Title Glimpse) సినిమాపై ఆసక్తిని పెంచింది.

‘హతః’ గ్లింప్స్‌లో చీకటిగా ఉన్న ఓ పెట్టె, అందులో కనిపించే పిల్లిని(Cat) చూపించి ఆ తర్వాత టైటిల్‌ను రివీల్ చేశారు. కథకు(Story) సంబంధించిన ఎలాంటి క్లూ ఇవ్వకుండా పిల్లి చుట్టూ మిస్టరీని(Mystery) క్రియేట్ చేయడంతో అసలు ఆ పిల్లికి కథతో ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. త్వరలో టీజర్ విడుదల కానున్నట్లు కూడా హింట్ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్(Pournami Entertainments) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుష్ గోరక్(Anush Gorak) కథ, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, జెసిన్ జార్జ్(Jesin George) సంగీతం అందిస్తున్నారు. కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవి, తనుజ పుట్టస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా కథ, పాత్రలు, జానర్‌ను మేకర్స్ ఇప్పటివరకు రహస్యంగానే ఉంచారు. దీంతో ‘హతః’ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తుందా? మరో విభిన్నమైన కథతో తెరకెక్కుతోందా? అనే ఆసక్తి నెలకొంది. గ్లింప్స్‌లో కనిపించిన పిల్లి వెనుక ఉన్న రహస్యం తెలియాలంటే తదుపరి అప్‌డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment