హాకీ ప్రపంచకప్ 2026లో (Hockey World Cup 2026) జర్మనీ (Germany) మరోసారి ఛాంపియన్‌గా(Champion) నిలిచింది. బెల్జియంలోని వావ్రేలో(Belgium Wavre) ఆగస్టు 30న జరిగిన ఫైనల్లో స్పెయిన్‌ను(Spain) 1-0తో ఓడించి టైటిల్‌ను (Title) సొంతం చేసుకుంది. తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ గోల్ కోసం ప్రయత్నించినా స్కోరు నమోదు కాలేదు.
మూడో క్వార్టర్‌లో(Third Quarter) 44వ నిమిషంలో మైకేల్ స్ట్రుతాఫ్ (Michael Struthoff) చేసిన గోల్‌తో జర్మనీ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్పెయిన్ సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా జర్మనీ డిఫెన్స్(Germany Defence) అడ్డుకుంది. చివరి నిమిషాల్లో గోల్‌కీపర్‌ను (Goalkeeper) తప్పించి అదనపు ఆటగాడిని మైదానంలోకి దించినా స్పెయిన్‌కు ఫలితం దక్కలేదు.
ఈ విజయంతో జర్మనీ పురుషుల హాకీ ప్రపంచకప్‌ను 4వసారి గెలుచుకుంది. గతంలో 2002, 2006, 2023లో టైటిల్స్ సాధించిన జర్మనీ.. 2026లోనూ విజేతగా నిలిచి పాకిస్థాన్ (Pakistan) 4 ప్రపంచకప్‌ల రికార్డును సమం చేసింది.
మరోవైపు స్పెయిన్ 3వసారి ఫైనల్‌కు చేరుకున్నా టైటిల్ సాధించలేకపోయింది. ఫైనల్లో లభించిన 4 పెనాల్టీ కార్నర్లను కూడా గోల్స్‌గా మలచుకోలేకపోయింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1తో నెదర్లాండ్స్‌ను ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
ఈ ప్రపంచకప్‌లో 16 జట్ల మధ్య మొత్తం 50 మ్యాచ్‌లు జరిగాయి. టోర్నీలో 248 గోల్స్(Goals) నమోదయ్యాయి. ఇందులో 136 ఫీల్డ్ గోల్స్, 97 పెనాల్టీ కార్నర్ గోల్స్, 15 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ ఉన్నాయి.








