---Advertisement---

డ్యాన్సర్స్ యూనియన్‌లో రచ్చ.. బట్టలూడదీసి కొడతానంటూ సుమలత వార్నింగ్!

August 31, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో (Film Dancers Association) వివాదం మరింత ముదిరింది. యూనియన్‌ను (Union) విభజించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన అధ్యక్షురాలు సుమలత(Sumalatha).. అలాంటి ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. యూనియన్‌ను రెండు ముక్కలు చేయాలని చూసేవారిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, నడిరోడ్డుపై బట్టలూడదీసి (Strip Clothes) కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మెజారిటీ సభ్యులు రఘు మాస్టర్‌ను (Raghu Master) కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని(Hyderabad) అసోసియేషన్ కార్యాలయంలో(Association Office) సుమలత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్‌పై కావాలనే ప్రతికూల ప్రచారం చేస్తున్నారని, సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీలో సగం మంది అవినీతికి పాల్పడినవారే ఉన్నారని విమర్శించారు.

ఫెడరేషన్ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సుమలత ఆరోపించారు. తమకు నేరుగా సహాయ నిరాకరణ నోటీసు ఇవ్వకుండా, 23 విభాగాల ద్వారా లేఖలు పంపించడాన్ని తప్పుబట్టారు. డ్యాన్సర్ల సమస్యలపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కు(Anil) చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు.

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు జరిగిన అన్యాయం రేపు మిగతా 23 విభాగాలకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని సుమలత హెచ్చరించారు. ఫెడరేషన్ తీరును ప్రశ్నిస్తూ అన్ని విభాగాలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చొరవ తీసుకుని డ్యాన్సర్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవి ఇప్పటికే తమతో మాట్లాడారని తెలిపారు.

మరోవైపు బాలకృష్ణ తమతో చర్చలు జరిపారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సుమలత స్పష్టం చేశారు. ఆయనతో తమకు ఎలాంటి సమావేశం జరగలేదన్నారు. ప్రస్తుతం నెలకొన్న వివాదం త్వరలోనే సద్దుమణుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment