---Advertisement---

పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే వేడుకల్లో హద్దులు దాటిన పార్టీ కార్యకర్తలు.. ఇదేనా సనాతన ధర్మం?

September 3, 2026

Summarize with AI

---Advertisement---

పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) పుట్టినరోజు (Birthday) వేడుకల పేరుతో నెల్లూరు(Nellore) జిల్లాలో జనసేన(Janasena) కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినాయకుడి ఆలయం వద్ద (Lord Vinayaka Temple)పవన్‌ కళ్యాణ్‌ కటౌట్‌ను(Cutout) ఏర్పాటు చేసి, పూలమాలలు వేసి, హారతులు ఇచ్చి, టెంకాయలు కొట్టి పూజలు చేయడం భక్తుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మం(Sanatana Dharma), హిందూ మనోభావాల (Hindu Sentiments) పరిరక్షణ గురించి మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌.. తన అభిమానులు, పార్టీ కార్యకర్తల తీరుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్తలు నడిరోడ్డుపై బస్సును(Bus) నిలిపి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తూ బైక్‌ స్టంట్లు, ఆర్టీసీ బస్సుపై డ్యాన్సులు, జెండాల ప్రదర్శనతో హల్‌చల్‌ చేసిన ఘటన కూడా విమర్శలకు దారితీసింది.

అమలాపురంలో(Amalapuram) పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విషాదం చోటుచేసుకుంది. బ్యానర్‌ మెటల్‌ ఫ్రేమ్‌ హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు(High-Tension Power Lines) తగలడంతో బెండమూరులంకకు చెందిన రొల్లా ప్రేమ్‌ కుమార్‌ (Rolla Prem Kumar) విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆయన కేవలం తన అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

విశాఖపట్నం(Visakhapatnam), విజయవాడ(Vijayawada) తదితర నగరాల్లోనూ రోడ్లను అడ్డుకుంటూ భారీ కేక్‌ కటింగులు, డ్యాన్సులు, బాణసంచా, వాహనాలతో హంగామా చేసిన ఘటనలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. అభిమానం పేరుతో సాధారణ ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పార్టీ కార్యకర్తల్లో క్రమశిక్షణ, ప్రజా సేవా భావం ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమాన ప్రదర్శన హద్దులు దాటి ప్రజలకు ఇబ్బందులు కలిగించే స్థాయికి చేరితే అది పార్టీ ప్రతిష్ఠపైనే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా ఘటనలను పవన్‌ కళ్యాణ్‌ నియంత్రించకపోతే జనసేనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అప్రతిష్ఠ ఏర్పడే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment