ఆసియా కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా గురువారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 క్రికెట్‌లో భారత మహిళల జట్టుకు ఇది రెండో అతిపెద్ద విజయం కావడం విశేషం.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్‌తో అండగా నిలిచింది. షెఫాలీ వర్మ 28, ప్రతీక రావల్ 10, రిచా ఘోష్ 11, హర్మన్‌ప్రీత్ కౌర్ 10 పరుగులకే పరిమితమైనా.. స్మృతి మాత్రం హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడింది.
కేవలం 59 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన స్మృతి.. మొత్తంగా 64 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి.. హాంకాంగ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు భారత బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. నటాషా మైల్స్ చేసిన 15 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. చివరి దశలో కేవలం 4 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయిన హాంకాంగ్.. 16.2 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. నందిని శర్మ, శ్రీచరణి, ప్రేమ రావత్ చెరో 2 వికెట్లు సాధించారు. దీంతో భారత్ 137 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి ఆసియా కప్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.








