---Advertisement---

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన కెప్టెన్!

September 7, 2026

Summarize with AI

---Advertisement---

చెన్నైలోని (Chennai) ఎంఏ చిదంబరం స్టేడియంలో(MA Chidambaram Stadium) జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో (Duleep Trophy 2026 Final) ఈస్ట్ జోన్ కెప్టెన్ (East Zone Captain) ఇషాన్ కిషన్ (Ishan Kishan) అదరగొట్టాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 301 బంతుల్లో 250 పరుగులు చేసి డబుల్ సెంచరీ (Double Century) పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

ఈ డబుల్ సెంచరీతో దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో 200కు పైగా పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. అంతేకాకుండా ఈస్ట్ జోన్ తరఫున 31 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

కెప్టెన్‌గా ఫైనల్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ ఇషాన్ రికార్డు నెలకొల్పాడు. గతంలో 1987లో అన్షుమన్ గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు. ఇషాన్ కంటే ముందు రామన్ లాంబా 320, అన్షుమన్ గైక్వాడ్ 216, చెతేశ్వర్ పుజారా 256, యశస్వి జైస్వాల్ 209 పరుగులు చేశారు.

తొలి రోజు 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఇషాన్, రెండో రోజు కూడా అదే దూకుడును కొనసాగించాడు. సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడి ఈస్ట్ జోన్‌ను 600 పరుగుల మార్క్ దాటించాడు. 250 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా(Retired Hurt) వెనుదిరిగిన ఇషాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment