గత రెండు రోజులుగా టీవీతో(TV) పాటు సోషల్ మీడియాలోనూ బిగ్‌బాస్ గ్రాండ్ థీమ్ మ్యూజిక్(Bigg Boss Grand Theme Music), సరికొత్త ప్రోమో వీడియోలు (New Promo Videos) తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ బిగ్‌బాస్ షో గురించే చర్చ జరుగుతోంది. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. 10వ సీజన్‌ను సెప్టెంబర్ 6న అత్యంత గ్రాండ్‌గా ప్రారంభించింది.
బిగ్‌బాస్ 10వ సీజన్‌లో భాగంగా వివిధ రంగాలకు చెందిన 16 మంది ప్రముఖ కంటెస్టెంట్లు(16 Popular Contestants) హౌస్‌లోకి అడుగుపెట్టారు. దీంతో తొలి ఎపిసోడ్ నుంచే ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేబ్జానీ మోదక్, త్రిగుణ్, ఝాన్సీ, సుధీర్ రెడ్డి, అమన్, చైత్ర రాయ్, ఆటో రామ్ ప్రసాద్, షాలిని, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం, నరేశ్, ఆర్జే చరణ్, కృష్ణుడు, వర్షిణి సౌందరరాజన్, రోహిత్, ముఖేశ్ గౌడ ప్రస్తుతం బిగ్‌బాస్ ఇంట్లో సందడి చేస్తున్నారు.
హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు గ్రూపులు కడుతూ, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. కొందరి మధ్య మాటల యుద్ధాలు, మరికొందరి మధ్య విభేదాలతో బిగ్‌బాస్ ఇల్లు రచ్చ రంబోలాగా మారుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా బిగ్‌బాస్ 10వ సీజన్ కంటెస్టెంట్ల పారితోషికానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్‌లో ఒక్కో కంటెస్టెంట్‌కు వారానికి ఎంత పారితోషికం అందుతోంది అనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లో అందరికంటే అత్యధిక పారితోషికం (Remuneration) ప్రముఖ హాస్యనటుడు ఆటో రామ్ ప్రసాద్(Auto Ram Prasad) అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు బిగ్‌బాస్ నిర్వాహకులు వారానికి రూ.4.50 లక్షలు చెల్లిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరరాజన్‌కు(Varshini Sounderajan) వారానికి రూ.3.50 లక్షల పారితోషికం అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సీరియల్ నటుడు ముఖేశ్ గౌడ (Mukesh Gowda) వారానికి రూ.3 లక్షలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక సామాన్య కంటెస్టెంట్ల (Common Contestants) విషయానికి వస్తే.. వారికి వారానికి సుమారు రూ.70 వేల వరకు పారితోషికం అందుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పారితోషిక వివరాలు ఎంతవరకు నిజమనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.







