నరసరావుపేట(Narasaraopet) టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) డా. చదలవాడ అరవిందబాబుకు(Dr. Chadalavada Aravind Babu) చెందిన అమూల్య నర్సింగ్ హోమ్‌లో(Amulya Nursing Home) సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund – CMRF), ఎల్‌ఓసీల (LOCs – Letters of Credit) పేరుతో నకిలీ బిల్లులు(Fake Bills) సృష్టించి ప్రభుత్వ నిధులను (Government Funds దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చికిత్సలు అందించకుండానే వందలాది బిల్లులు సమర్పించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీ సేవలను నిలిపివేసి ఆస్పత్రిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(Gopireddy Srinivasa Reddy) ఈ వ్యవహారంలో సుమారు రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే పాత్రపై సమగ్ర దర్యాప్తు జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీలో(Aarogyasri) జరిగిన ఆపరేషన్లను తిరిగి సీఎంఆర్‌ఎఫ్‌కు చూపించి నిధులు పొందినట్లు కూడా ఆయన ఆరోపించారు.
అమూల్య నర్సింగ్ హోమ్ వ్యవహారంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్‌ఓసీలపై సమగ్ర విచారణ జరపాలని గోపిరెడ్డి కోరారు. గతంలో పోలీసు వ్యవహారంలో వివాదానికి కేంద్రంగా నిలిచిన ఎమ్మెల్యేకు, ఇప్పుడు సొంత ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలు మరో రాజకీయ చిక్కుగా మారాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పాత్ర, పీఏలు, వైద్యులు, సిబ్బంది ప్రమేయంపై దర్యాప్తు జరగనుంది.





