---Advertisement---

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌.. 34 శాతానికి ఆధారమేంటి?

September 10, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) బీసీలకు (BCs) 34 శాతం రిజర్వేషన్లు (34% Reservations) కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు (High Court) కీలక ప్రశ్నలు సంధించింది. బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను (Rajiv Ranjan Mishra Commission Report) ఇంకా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెబుతూనే.. అదే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఎలా ఖరారు చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది.

కమిషన్‌ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీసిన కోర్టు.. అందులో అంత రహస్యం ఏముందని ప్రశ్నించింది. బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) సంబంధించిన పూర్తి గణాంకాలను తమ ముందుంచాలని, ఏ ప్రాతిపదికన 34 శాతం రిజర్వేషన్లు నిర్ణయించారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 16కు వాయిదా వేసింది.

బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఏర్పాటు చేసిన రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం కొద్దిరోజుల క్రిందటే మరోసారి సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది. ఫిబ్రవరి 19న ఏర్పాటైన ఈ కమిషన్‌ నిర్దేశిత సమయంలో నివేదిక ఇవ్వకపోవడంతో ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు. ఈ నేపధ్యంలో హైకోర్టు వేసిన కీలక ప్రశ్నలు ప్రాధాన్యత సంతరించుకుంది

ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision of Electoral Rolls) పూర్తయి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ హైకోర్టును కోరింది. పార్టీ తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం (Subramanya Sriram) వాదిస్తూ.. సర్ లో తొలుత ఓటు కోల్పోయిన వారికి అప్పీల్‌ ద్వారా తుది జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంటుందని వివరించారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే తమ పిటిషన్‌ నిరర్థకమవుతుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే పిటిషన్‌ నిరర్థకమయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, ప్రస్తుతానికి వెంటనే నోటిఫికేషన్‌ వెలువడదని భావిస్తున్నట్లు తెలిపింది.

బీసీ జనగణనను (BC Census) శాస్త్రీయంగా చేపట్టకుండా ఎన్నికలు నిర్వహించరాదని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు (Keshana Shankara Rao) దాఖలు చేసిన పిల్‌పైనా విచారణ జరిగింది. కమిషన్‌ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడంతో దాన్ని పరిశీలించకుండా వాదనలు ఎలా వినిపించగలమని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు.

ఇక 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ జీవోలను సవాలు చేసిన న్యాయవాది తాండవ యోగేష్‌(Tandava Yogesh).. రిజర్వేషన్లు 50 శాతం దాటడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. మరో పిటిషన్‌లో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కమిషన్‌ నివేదికను తొక్కిపెడుతోందని, 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చి భవిష్యత్తులో వాటిని కోర్టు కొట్టివేస్తే ఆ నెపాన్ని కోర్టుపై నెట్టేయాలనే ఉద్దేశం ప్రభుత్వానిదని న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి (Gundala Shivaprasad Reddy) ఆరోపించారు.

మొత్తంగా.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయానికి ఆధారమేంటి? మిశ్రా కమిషన్‌ నివేదికలో అసలు ఏముంది? రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? అనే అంశాలపై హైకోర్టు తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment