---Advertisement---

అధికారుల మాట వినరా?.. స్కిల్‌ స్కామ్‌ గుణపాఠం మరిచారా?

September 12, 2026

Summarize with AI

---Advertisement---

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి కే. సునీతతో(K. Sunitha) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కలెక్టర్ల సదస్సులో(Collectors Conference) వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈడబ్ల్యూఎస్‌ నిబంధనలు(EWS Rules), ఆన్‌లైన్‌ ధృవీకరణకు (Online Verification) సంబంధించిన కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మధ్య ఉన్న తేడాలను సునీత వివరించే ప్రయత్నం చేస్తుండగా.. చంద్రబాబు పలుమార్లు ఆమె మాటలకు అడ్డుతగిలినట్లు కనిపించిన వీడియోపై చర్చ జరుగుతోంది. సీనియర్‌ అధికారిణి వివరణను పూర్తిగా వినకుండా మధ్యలోనే జోక్యం చేసుకోవడం సరైనదేనా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

పలు కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న సునీతకు పరిపాలనా నిబంధనలు, ప్రభుత్వ విధానాలపై విస్తృత అవగాహన ఉంది. ఇదే నేపథ్యంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (Skill Development Case) వ్యవహారంలో ఆమె తీసుకున్న వైఖరి మరోసారి చర్చకు వచ్చింది.

టీడీపీ(TDP) ప్రభుత్వ హయాంలో సునీత ఫైనాన్స్‌ సెక్రటరీగా (Finance Secretary) పనిచేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSSDC)–సీమెన్స్‌ ప్రాజెక్టుకు (Siemens Project) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలపై ఆమె ఫైల్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పలు దర్యాప్తు పత్రాల్లో ప్రస్తావన వచ్చింది. సీమెన్స్‌ బిజినెస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆమె అభిప్రాయపడినట్లు సమాచారం. అలాగే ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌గా (Grant-in-Aid) రావాల్సి ఉండగా, ఆ నిధులు అందకముందే రాష్ట్ర ప్రభుత్వం తన 10 శాతం వాటాగా పేర్కొన్న రూ.371 కోట్లను విడుదల చేయడం సముచితం కాదని ఆమె నాడే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.

అయితే, తన అభ్యంతరాలను పక్కనబెట్టి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నిధుల విడుదల జరిగిందనే విషయాన్ని ఫైల్‌ నోటింగ్స్‌లో నమోదు చేసినట్లు ఈ కేసుకు సంబంధించిన వాదనలు, దర్యాప్తు రికార్డుల్లో ప్రస్తావించబడింది. అనంతరం ఈ నిధుల వినియోగంపై సీఐడీ(CID), ఈడీ(ED) దర్యాప్తులు జరిగాయి. ఈ పరిణామాలే చివరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టుకు దారితీసిన న్యాయపరమైన పరిణామాల్లో భాగమయ్యాయి.

అలాంటి సీనియర్‌ అధికారిణి ఒక విధానపరమైన అంశాన్ని వివరిస్తున్నప్పుడు ఆమె చెప్పేది పూర్తిగా వినడం ముఖ్యమంత్రిగా బాధ్యత కాదా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. పరిపాలనలో నిబంధనలు, విధివిధానాలపై అధికారులు ఇచ్చే సూచనలను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ల సదస్సు వంటి వేదికపై అధికారుల వివరణలకు అవకాశం ఇవ్వకుండా పదేపదే జోక్యం చేసుకోవడం ద్వారా ‘అన్నీ తనకే తెలుసు’ అనే ధోరణి చంద్రబాబులో కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment