---Advertisement---

పులివెందులలో గణేష్ మండపం వద్ద రచ్చ.. టీడీపీ నేతల ఘర్షణలో గన్‌ఫైర్‌!

September 15, 2026

Summarize with AI

---Advertisement---

పులివెందులలో(Pulivendula) గణేష్‌ విగ్రహం (Ganesh Idol) వద్ద టీడీపీ (TDP) నేతల మధ్య చోటుచేసుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మైత్రి లేఔట్‌లోని(Maitri Layout) వినాయక మండపం వద్ద తనను సన్మానించలేదని టీడీపీ నేత పుష్పనాథ్‌రెడ్డిని (Pushpanath Reddy) విజయ్‌కుమార్‌రెడ్డి(Vijay Kumar Reddy) నిలదీయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైనట్లు సమాచారం.

ఈ వివాదం క్రమంగా ఘర్షణకు దారితీసి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పాటు రాళ్లు రువ్వుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద నిలిపి ఉంచిన మూడు వాహనాలు(Three Vehicles) ధ్వంసమైనట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి హజ్ కమిటీ డైరెక్టర్ భాషా మధ్యవర్తిత్వానికి ప్రయత్నించగా, ఉద్రిక్తత మరింత పెరగడంతో ఆయన గన్‌మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

అర్ధరాత్రి గణేష్‌ వేడుకల ప్రాంగణంలోనే టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు బహిర్గతం కావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment