వెస్టిండీస్‌తో (West Indies) జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు (ODI series) బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. యువ ఆటగాళ్లు నమన్ ధీర్(Naman Dhir), అకిబ్ నబీ (Aqib Nabi) తొలిసారి చోటు దక్కించుకోగా.. హార్దిక్ పాండ్య(Hardik Pandya), రిషభ్ పంత్‌లకు (Rishabh Pant) అవకాశం లభించలేదు.
హార్దిక్ పాండ్య ఎంపిక కాకపోవడానికి ఫిట్‌నెస్ (Fitness) కారణంగా తెలుస్తోంది. 10 ఓవర్ల పూర్తి కోటాను బౌలింగ్ చేయగల స్థాయిలో ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాతే అతడిని వన్డేలకు ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
రిషభ్ పంత్ విషయంలో మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. వైట్ బాల్ క్రికెట్‌లో పంత్ ప్రతిభ ఉన్నప్పటికీ.. నిలకడగా పరుగులు (Consistently Runs) చేయకపోవడాన్ని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది.
ఇక హార్దిక్ గైర్హాజరీతో వన్డేల్లో సీమింగ్ ఆల్‌రౌండర్ అవసరం ఉండటంతో నితీశ్ కుమార్ రెడ్డికి(Nitish Kumar Reddy) అవకాశం కల్పించినట్లు సమాచారం. భవిష్యత్తులో పాండ్యకు ప్రత్యామ్నాయంగా నితీశ్‌ను సిద్ధం చేసే దిశగా సెలెక్టర్లు చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పంత్ పూర్తిగా జాతీయ జట్టుకు దూరం కాలేదు. ఇరానీ కప్‌లో(Irani Cup) రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest of India) జట్టుకు అతడిని కెప్టెన్‌గా (Captain) ఎంపిక చేశారు. దీంతో ఈ టోర్నీ పంత్ తన ఫామ్‌ను నిరూపించుకునేందుకు కీలక అవకాశంగా మారనుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య 3 వన్డేలు, 5 టీ20లు జరగనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి తిరువనంతపురంలో సిరీస్ ప్రారంభం కానుంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ (KL Rahul) వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.







