---Advertisement---

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకంపై వెనక్కి తగ్గిన కూటమి సర్కార్‌.. మళ్లీ ఏపీపీఎస్సీకే బాధ్యత!

September 17, 2026

Summarize with AI

---Advertisement---

పరీక్ష (Exam) లేకుండా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల (Veterinary Assistant Surgeons) నియామకాలు చేపట్టాలన్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్(YSRCP) అలాగే నిరుద్యోగుల (Unemployed Candidates) నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) కీలక నిర్ణయం తీసుకుంది. నియామక ప్రక్రియను తిరిగి ఏపీపీఎస్సీకి (APPSC) అప్పగిస్తూ కొత్త జీవో జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నియామకాల్లో అక్రమాలకు అవకాశం ఉంటుందంటూ ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నల నేపథ్యంలో ప్రభుత్వం తన గత నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. పరీక్ష లేకుండానే నియామకాలు చేపట్టే విధానాన్ని సమర్థిస్తూ వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తదితరుల వాదనలపై కూడా తాజా ఉత్తర్వులతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా ఉత్తర్వుల ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల నియామక బాధ్యతను ఏపీపీఎస్సీ చేపట్టనుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరగనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment