---Advertisement---

పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ పెళ్లికి బ్రేక్.. విడిపోతున్నట్లు ప్రకటించిన ఆకృతి!

September 17, 2026

Summarize with AI

---Advertisement---

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw), ఆకృతి అగర్వాల్(Akriti Agarwal) తమ వివాహానికి(Marriage) ముందే విడిపోవాలని (Breakup) నిర్ణయించుకున్నారు. సుమారు 6 నెలల క్రితం నిశ్చితార్థం(Engagement) చేసుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట తాజాగా తమ నిర్ణయాన్ని వెల్లడించింది.

ఈ విషయాన్ని ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (Instagram Account) ద్వారా తెలియజేశారు. భవిష్యత్తుపై తమ ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలు(Different Goals), భిన్నమైన పరిస్థితులు(Different Circumstances) ఉన్నాయని గుర్తించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు.

తమ మధ్య ప్రేమ, అనుబంధం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు, వ్యక్తిగత బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని జీవితంలో వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నట్లు ఆకృతి పేర్కొన్నారు. విడిపోయినప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం (Respect) మాత్రం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

ఈ కొత్త దశలో ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా, సంతోషంగా సాగాలని ఆకృతి ఆకాంక్షించారు. అలాగే తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, విడిపోవడానికి గల కారణాలపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని ఆమె కోరారు.

దీంతో వివాహం జరగకముందే పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ల నిశ్చితార్థ బంధానికి 6 నెలలకే ముగింపు పలికినట్లయింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment