విజయవాడ మేయర్ (Vijayawada Mayor) పదవిని ఈసారి ముస్లింలకు(Muslims) ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ(TDP) నేత జలీల్‌ఖాన్ (Jaleel Khan) డిమాండ్ చేశారు. ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ముస్లింలకు చిన్న చిన్న నామినేటెడ్ పదవులు(Nominated Posts) మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.
మేయర్ పదవిని మైనార్టీలకు (Minorities) ఇవ్వాలని జలీల్‌ఖాన్ కోరారు. ఒకవేళ మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ అయితే తన కుమార్తెకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. బీజేపీ(BJP) మైనార్టీల ప్రాధాన్యతను గుర్తిస్తోందని, అయితే చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు తనకు నచ్చడం లేదని జలీల్‌ఖాన్ అన్నారు. విజయవాడలో టీడీపీ గెలవాలన్నా, పార్టీ అభ్యర్థి గెలవాలన్నా మైనార్టీల మద్దతు అవసరమని చెప్పారు.
గతంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్‌ను ముస్లింలకు ఇచ్చేవారని గుర్తు చేసిన జలీల్‌ఖాన్.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో ముస్లింలకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని అన్నారు. ఆ సమయంలో తనకు బాధ కలిగినా మౌనంగా ఉన్నానని చెప్పారు.
ముస్లింలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు (Rajya Sabha Posts) కూడా ఇవ్వడం లేదని జలీల్‌ఖాన్ ఆరోపించారు. చిన్న చిన్న నామినేటెడ్ పదవులతోనే సరిపెడుతున్నారని విమర్శించారు.
2019లో తన కుమార్తెను టీడీపీలోకి తీసుకువచ్చి, ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలోకి దించి ఆమెను ఓడించారని జలీల్‌ఖాన్ ఆరోపించారు. తన కుమార్తె ఓటమి వెనుక కుట్ర ఉందని చెప్పిన ఆయన, అప్పట్లో తాను ఎవరి పేర్లూ బయటపెట్టలేదన్నారు. టీడీపీలో చర్యలు ఉండవని, కనీసం స్పందన కూడా ఉండదని విమర్శించారు.
విజయవాడ మేయర్ పదవిపై టీడీపీలో ఇప్పటికే పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గం కోటాలో తన కుమారుడు సిద్ధార్థ్‌కు (Siddharth) మేయర్ పదవి ఇప్పించేందుకు బోండా ఉమా(Bonda Uma) ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommarreddy Pattabhiram) కూడా మేయర్ పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు నేతలు కూడా మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జలీల్‌ఖాన్ ముస్లిం మైనార్టీలకు మేయర్ పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడంతో విజయవాడ మేయర్ పదవి విషయంలో టీడీపీలో పోటీ మరింత పెరిగిందనే చర్చ జరుగుతోంది.





