కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక విషయాలను కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. పోలీసుల దాడిలోనే సాయికృష్ణ మృతి చెందినట్లు సిట్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏ4 నిందితుడు సురేశ్ రిమాండ్ రిపోర్టులోనూ ఈ అంశాలను సిట్ స్పష్టం చేసినట్లు సమాచారం.
మే 7న పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను విచారించిన అనంతరం రాణిగారితోటలోని ఓ పాడుబడ్డ భవనానికి తీసుకెళ్లి కొట్టినట్లు సిట్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మే 12న సాయికృష్ణ మృతిచెందిన తర్వాత అర్ధరాత్రి సమయంలో సీఐ నాగరాజు, సురేశ్, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కలిసి మృతదేహాన్ని బైక్పై స్వర్గపురి శ్మశానవాటికకు తరలించి దహనం చేసినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
సాయికృష్ణపై దాడికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసి ఆధారాలను మాయం చేసినట్లు సిట్ కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సాయికృష్ణ బంధువులను పోలీసులు బెదిరించడంతో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని, వారిని ప్రలోభపెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయని సిట్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.





