సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా'(Sigma) సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తమిళ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి(CM) దళపతి విజయ్ (Thalapathy Vijay) కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో అంచనాలు పెరిగాయి. లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
విడుదలకు ముందు చిత్రబృందం తాజాగా సిగ్మా ట్రైలర్‌ను (Sigma Trailer) విడుదల చేసింది. అండర్‌వరల్డ్ మాఫియా(Underworld Mafia), డ్రగ్స్(Drugs), క్యాసినో రాకెట్ (Casino Racket) నేపథ్యంలో కథ సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో రూ.500 కోట్ల భారీ రాకెట్‌ను ఎదుర్కొనే పాత్రలో సందీప్ కిషన్ కనిపించాడు. యాక్షన్, క్రైమ్, అడ్వెంచర్ అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది.
సందీప్ కిషన్ స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకోగా, ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కీలక పాత్రలో కనిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ట్రైలర్లో ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్‌తో పాటు తల్లి, కొడుకుల అనుబంధం, కామెడీ, కుటుంబ భావోద్వేగాలకు కూడా సినిమాలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
దర్శకుడిగా తొలి సినిమాతోనే జాసన్ సంజయ్ భారీ స్థాయి కమర్షియల్ కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ సినిమాకు స్టైలిష్ లుక్‌ను తీసుకురాగా, ఎస్. థమన్ (S. Thaman) నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు మరింత ఉత్సాహాన్ని జోడించింది.
ఇప్పటికే పాటలు, పోస్టర్లతో ఆసక్తి పెంచుకున్న సిగ్మా.. తాజాగా ట్రైలర్‌తో మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుండగా, తెలుగు వెర్షన్‌ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా కలిసి విడుదల చేయనున్నాయి.







