దీపికా పదుకొణె(Deepika Padukone), రణ్వీర్ సింగ్ (Ranveer Singh) దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. సెప్టెంబర్ 19న తమ రెండో ఆడబిడ్డకు (Second Baby Girl) స్వాగతం పలికిన ఈ స్టార్ కపుల్.. ఈ ఆనందకర విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘వెల్కమ్ బేబీ గర్ల్ (Welcome Baby Girl).. 19-09-2026.. ఇట్లు.. దువా, దీపిక, రణ్వీర్’ అంటూ బేబీ పాదం ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్(Post) ప్రస్తుతం వైరల్గా మారింది. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు దీపిక, రణ్వీర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా, దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ దంపతులకు 2024లో తొలి ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు దువా అనే పేరు పెట్టారు. ఇప్పుడు మరో ఆడబిడ్డకు స్వాగతం పలకడంతో ఈ స్టార్ దంపతుల కుటుంబంలో ఆనందం మరింత పెరిగింది.







