---Advertisement---

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు – సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

September 21, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు దిగుతోందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు.

డీఎస్సీలో టెట్‌ అర్హత లేని వారికి ఉద్యోగాలు, సంబంధం లేని సబ్జెక్టుల్లో నియామకాలు, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు, నకిలీ పత్రాల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని సజ్జల పేర్కొన్నారు. అక్రమాలపై న్యాయస్థానాల్లో పోరాడతామని, కూటమి ప్రభుత్వ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment