---Advertisement---

గాదే సాయికృష్ణ లాకప్ డెత్‌లో సీబీఐ విచారణపై హైకోర్టు తీర్పు రిజర్వ్

September 22, 2026

Summarize with AI

---Advertisement---

విజయవాడలో(Vijayawada) గాదే సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ కేసు (Lockup Death) మరో కీలక మలుపు తిరిగింది. కృష్ణలంక పోలీసుల కస్టడీలో (Krishna Lanka Police Custody) జరిగిన భౌతిక హింస కారణంగానే సాయికృష్ణ మృతి చెందినట్లు సిట్(SIT) దర్యాప్తులో వెల్లడైనట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. మే 7న పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం సాయికృష్ణను రాణీగారి తోటలోని పాడుబడిన భవనానికి తరలించినట్లు, అక్కడ తీవ్రంగా కొట్టినట్లు దర్యాప్తులో వివరాలు వెలుగుచూశాయి. మే 12న ఆయన మృతి చెందినట్లు సిట్ పేర్కొంది.

మృతదేహాన్ని రహస్యంగా తరలించి దహనం చేయడం, కస్టడీలో తీసిన ఫొటోలను తొలగించడం, అస్థికలను నదిలో కలపడం ద్వారా ఆధారాలను ధ్వంసం చేసినట్లు సిట్ ఆరోపించింది. ఈ కేసులో సస్పెండెడ్ సీఐ నాగరాజుతో(CI Nagaraju) పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఆర్ఎంపీ వైద్యుడు (RMP Doctor) సహా ఏడుగురిని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అలాగే సాయికృష్ణ కుటుంబ సభ్యులను హెబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరించుకునేలా బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసిన అంశాలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది.

అయితే సాయికృష్ణను పోలీసులు ఎందుకు నిర్బంధించారు? రహస్య ప్రాంతానికి ఎందుకు తరలించారు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తిచేసిన ఏపీ హైకోర్టు (AP High Court) తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment