---Advertisement---

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. లాఠీఛార్జ్‌పై సీపీఐ(ఎం) ఆగ్రహం!

September 22, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ (DSC) స్పోర్ట్స్ కోటా(Sports Quota) నియామకాలపై ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ (YSRCP) కార్యకర్తలు, నిరుద్యోగులపై(Unemployed) జరిగిన లాఠీఛార్జీని (Lathi Charge) సీపీఐ(ఎం)(CPI(M)) రాష్ట్ర కమిటీ ఖండించింది. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పార్టీలు, సంఘాలు, సంస్థలకు ఉన్న ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును నిరాకరించడం అప్రజాస్వామికమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు(V. Srinivasa Rao) పేర్కొన్నారు.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సవాళ్లతో స్పందించడం కంటే న్యాయ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులను(Teachers) రాజకీయ ప్రయోజనాల కోసం పోటీగా రంగంలోకి దించడం సమస్యను మరింత జఠిలం చేసి పరస్పర ఉద్రిక్తతలకు దారితీస్తుందని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment