---Advertisement---

గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో సీఐ నాగరాజుకు కోర్టులో షాక్

September 25, 2026

Summarize with AI

---Advertisement---

గాదె సాయికృష్ణ (Gade Saikrishna) కస్టోడియల్‌ డెత్‌ (Custodial Death) కేసులో సీఐ నాగరాజుకు (CI Nagaraju) రెండో ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో (AJMFC Court) ఎదురుదెబ్బ తగిలింది. డిఫాల్ట్‌ బెయిల్‌ (Default Bail) కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. డిఫాల్ట్‌ బెయిల్‌ పొందేందుకు నాగరాజు అర్హుడు కాదని స్పష్టం చేసింది.

సిట్‌(SIT) అసంపూర్తి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిందని, అందువల్ల డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయాలని నాగరాజు తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా, సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసుపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ముందుగా హైకోర్టు(High Court) తీర్పు వెలువడే వరకు వేచి చూడటం సముచితమని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌(Justice Vikram Nath), జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌(Justice Augustine George Masih), జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో(Justice Sandeep Mehta) కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పు అనంతరం అవసరమైతే ఈ అంశంలో జోక్యం చేసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 26కు వాయిదా వేసింది.

సాయికృష్ణ మృతికి కారణమైన అసలు దోషులు, ఉన్నతాధికారుల పాత్రను తేల్చడంతో పాటు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ(YSRCP) ఎంపీ గురుమూర్తి (Gurumurthy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేసు పరిణామాలను పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది నిఖిల్‌ గోయల్‌, న్యాయవాదులు అల్లంకి రమేష్‌, రాళ్ల మమత ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

సాయికృష్ణ కనిపించకపోవడంపై ఆయన తల్లి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌తో పాటు, కేసును సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టు తీర్పు అనంతరం తదుపరి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment