తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో(Undrajavaram) దివంగత వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) విగ్రహం ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీసింది. కాపు యువత (Kapu youth) గురువారం అర్ధరాత్రి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, కొద్దిసేపటికే అది మాయమైంది. టీడీపీకి(TDP) చెందిన వారు ఆ విగ్రహాన్ని మాయం చేశారంటూ కాపు యువత ఆరోపణలు చేశారు. దీంతో శుక్రవారం మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి కాపు యువత ఆందోళన చేపట్టింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఈ క్రమంలో పోలీసులు, యువత మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు రెండో విగ్రహాన్ని కూడా స్టేషన్కు తరలించగా, దిమ్మెను పొక్లెయినర్తో తొలగించారు.
విగ్రహం ఏర్పాటుకు అనుమతి విషయంలో మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) జాప్యం చేశారని కాపు యువత ఆరోపించింది. కాగా, రంగా విగ్రహం ఏర్పాటు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని వైఎస్సార్సీపీ(YSRCP) రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర (Vangaveeti Narendra) ప్రకటించారు. రెండు రోజుల్లో ఉండ్రాజవరం వస్తామని, విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.





