---Advertisement---

స్టిక్కర్లు మార్చి.. పెయింటింగ్ వేసి.. కొత్తవిగా ఆరోగ్య రథాల ప్రారంభం?

September 26, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ (Satyakumar) నిర్వహించిన ఓ కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో (YSRCP Government) కొనుగోలు చేసిన అంబులెన్స్‌లకు(Ambulances) స్టిక్కర్లు (Stickers) మార్చి, కొత్త వాహనాల (New Vehicles) మాదిరిగా ప్రారంభించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైఎస్‌ జగన్‌ (YS Jagan) ప్రభుత్వ హయాంలో 2023లో కొనుగోలు చేసిన 71 అంబులెన్స్‌లను మంత్రి సత్యకుమార్‌ మళ్లీ జెండా ఊపి ప్రారంభించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇప్పటికే వినియోగంలో ఉన్న 104 వాహనాలకు కొత్త స్టిక్కర్లు మార్చి, వాటిని ‘ఆరోగ్య రథాలు’గా (Aarogya Rathalu) ప్రచారం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాహనాలకు స్టిక్కర్లు మార్చడం, పెయింటింగ్‌ (Painting) వేయడం ద్వారా గతంలో కొనుగోలు చేసిన వాహనాలను కొత్తవిగా చూపించి కూటమి ప్రభుత్వం (Coalition Government) క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నం చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంపై స్థానికంగా విమర్శలు, సెటైర్లు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఈ వాహనాలు ఎప్పుడు కొనుగోలు చేశారు? గతంలోనే ప్రారంభమై వినియోగంలో ఉన్న వాహనాలను ఇప్పుడు ఎందుకు మళ్లీ ప్రారంభించారు? ‘ఆరోగ్య రథాలు’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కొత్తగా ఏముంది? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.

ఇదే తరహాలో గత ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడంపై కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ‘అమ్మ ఒడి’ (Amma Vodi) నుంచి ‘వైఎస్సార్‌ కళ్యాణమస్తు’(YSR Kalyanamasthu) వరకు పథకాల పేర్ల మార్పు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల పేర్ల మార్పు వంటి నిర్ణయాలు చర్చకు దారితీశాయి.

ఇప్పటికే గతంలో ఉన్న పాఠశాల విద్యార్థుల (Students) యూనిఫాం రంగుల (Uniform Colours) మార్పు చేయడం ఎందుకనే ప్రశ్నలు వస్తూనే ఉన్న, ఇప్పుడు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన అంబులెన్స్‌లకు రంగులు, స్టిక్కర్లు మార్చి కొత్తగా ప్రారంభించడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉన్న వాహనాలకు కొత్త రూపం ఇచ్చి వాటిని కొత్త కార్యక్రమంగా ప్రదర్శించడం ద్వారా కూటమి ప్రభుత్వం తన పాలనలో కొత్తదనం కంటే పేర్లు, రంగుల మార్పులకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment