హైదరాబాద్‌లో (Hyderabad) శబ్ద కాలుష్యంపై(Noise Pollution) సినీ నటుడు అల్లు శిరీష్ (Allu Sirish) పోలీసులను(Police) ఆశ్రయించారు. అర్ధరాత్రి(Midnight) దాటినా మైకులు(Mics), లౌడ్‌స్పీకర్ల(Loudspeakers) నుంచి భారీ శబ్దం వినిపిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యపై హైదరాబాద్ సిటీ పోలీసులను(Hyderabad City Police) సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
షేక్‌పేటలోని అపర్ణా వన్ గేటెడ్ సొసైటీలో(Aparna One Gated Society) నివసిస్తున్న అల్లు శిరీష్.. తన ఇంటికి సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం(Vinobanagar Hanuman Temple) నుంచి గత కొన్ని రోజులుగా భారీ శబ్దంతో సంగీతం వినిపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మైకుల శబ్దం కొనసాగుతోందని తెలిపారు.
ఈ శబ్దం కారణంగా అపార్ట్‌మెంట్‌లోని వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోలేక ఇబ్బందులు పడుతున్నారని శిరీష్ చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా శబ్ద కాలుష్య నిబంధనలను అమలు చేయాలని అధికారులను కోరారు.
Respected @hydcitypolice . I'm a resident of Aparna One, Shaikpet. For the last few days the Hanuman temple at Vinobha Nagar is playing loud music, beyond allowed decibels till night 2/3am. I complained the Film Nagar PS.
— Allu Sirish (@AlluSirish) September 27, 2026
They asked us to bear till 25th Sept as its Ganesh… pic.twitter.com/ggJp4U4hdU
శబ్ద కాలుష్యంపై ఇప్పటికే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీష్ వెల్లడించారు. అయితే గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని పోలీసులు సూచించినట్లు తెలిపారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా ఆలయం వద్ద మైకుల శబ్దం కొనసాగుతోందని పేర్కొన్నారు.
గతంలోనూ స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని శిరీష్ తెలిపారు. అర్ధరాత్రి వరకు భారీ శబ్దంతో లౌడ్‌స్పీకర్లు (Loudspeakers) వినిపించడం వల్ల ప్రజల నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు.
రాత్రి వేళల్లో శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అల్లు శిరీష్ హైదరాబాద్ సిటీ పోలీసులను కోరారు. ఆయన చేసిన ఫిర్యాదు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో పలువురు నెటిజన్లు కూడా రాత్రివేళల్లో శబ్ద కాలుష్యంపై స్పందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని కొందరు పేర్కొంటూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







